క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, జనవరి 10: స్థానిక బైపాస్‌రోడ్‌లోని కరుణగిరి టిఎన్‌జివోస్ కాలనీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామన్నపేటకు చెందిన ఇద్దరు సుతారి కూలీలు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. రామన్నపేటకు చెందిన యాకూబ్ (26), చంద్రగాని శ్రీకాంత్ (25)లు మండలంలోని సాయి గణేష్‌నగర్‌లో సుతారి పనిచేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదేసమయంలో వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొని వారి తలపై భాగం నుండి వెళ్లడంతో మెదడు ఛిద్రమై ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. యాకూబ్‌కు నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. మృతునికి భార్య, మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. మృతుడు శ్రీకాంత్‌కు భార్య, ఆరు నెలల బిడ్డ ఉన్నారు. వీరిద్దరు ఒక్క కుటుంబ సభ్యుల్లా కలిసి ఉంటారు. ఇద్దరు మిత్రులు మృతి చెందడంతో రామన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్తలు చిన్న వయస్సులోనే మృతి చెందడంతో ఇరువురి కుటుంబాలకు దిక్కులేని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురికీ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల రోదనలు ప్రతి ఒక్కరిని కంఠతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి మృతుల భౌతిక కాయాలను పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.