క్రైమ్/లీగల్

మద్యం సేవించి డ్రైవింగ్.. ఇద్దరికి శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జనవరి 10: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు వ్యక్తులకు మల్కాజ్‌గరి కోర్టు శిక్ష విధించింది. శిక్షలో భాగంగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడుపరాదు అనే ప్లేకార్డులు చేతబూని నాగారం, రాంపల్లి గ్రామాల చౌరస్తాలో ఒకరోజు ప్రదర్శించారు. కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్‌ఐ విద్యాసాగర్ మాట్లాడుతూ వాహన తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి, కోర్టు ఆదేశాల మేరకు శిక్షలు విధిస్తున్నామని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపటం ద్వారా యాక్సిడెంట్‌లు జరుగుతాయని, తద్వారా వారి కుటుంబాలు ఇంటి పెద్ధను కోల్పోవలసి వస్తుందని, మద్యం సేవించే ముందు కుటుంబం గుర్తుకు రావాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై శిక్షలు తప్పవని పేర్కొన్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఘట్‌కేసర్, జనవరి 10: నారపల్లిలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను మండల రెవెన్యూ అధికారులు గురువారం ఉదయం కూల్చివేశారు. అధికారులు, స్థానికుల మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రెవెన్యూ అధికారులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి నారపల్లి గ్రామంలోని మందడి సురేందర్‌రెడ్డి నగర్‌ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంత కాలంగా అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో అధికారులు గతంలో హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలను యథేచ్ఛగా చేపట్టడంతో మండల రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చివేతలు జరిపారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.