క్రైమ్/లీగల్

రూ 20 లక్షలు విలువైన నకిలీ ఎరువుల బస్తాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 11: మార్కాపురం డివిజన్ పరిధిలోని త్రిపురాంతకంలో నకిలీ ఎరువులను రైతులకు విక్రయస్తున్న పలు ఎరువుల షాపులను శుక్రవారం జిల్లాకు చెందిన విజిలెన్స్ అధికారులు, త్రిపురాంతకం పోలీసులు తనిఖీలు నిర్వహించి సుమారు 20 లక్షల రూపాయలు విలుచేసే నకిలీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక విజిలెన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అడిషనల్ ఎస్‌పి, విజిలెన్స్ ఎం రజనీ మాట్లాడుతూ గుంటూరులోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ వారు బ్రాండ్ పొటాష్ ఎరువులను తయారుచేసి రాష్ట్రంలోని వివిధ షాపులకు అమ్మడం జరుగుతుందని తెలిపారు. అయితే మైసూరుకు చెందిన ఒక ముఠా అదే బ్రాండ్ పొటాష్‌ని కాపీ కొట్టి ఆ పొటాష్ ఎరువులలో ఉప్పు కలిపి నకిలీ పొటాష్ ఎరువులను తయారు చేసి ఆ ముఠా సభ్యులు గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాలోని పలు షాపులకు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో జిల్లాలోని త్రిపురాంతకంలో గల పలు ఎరువుల షాపుల్లో నకిలీ ఎరువులను అమ్మటం వలన రైతులు ఆ ఎరువులను కొనుగోలుచేసి తమ పొలాలోని పంటలకు వేయడం కారణంగా పంట నష్టపోతున్నట్లు తమకు సమాచారం రావడంతో శుక్రవారం త్రిపురాంతకంలోని బాలాజీ త్రిపురసుందరీ ఫర్టిలైజర్ షాపుతోపాటు, శ్రీ వెంకట రాఘవేంద్ర ఫర్టిలైజర్స్, శ్రీ వెంకటసుబ్రహ్మణ్యం ఫర్టిలైజర్స్ షాపులను శుక్రవారం తనిఖీ చేసి ఆయా షాపుల్లో రైతులకు విక్రయిస్తున్న సుమారు 20 లక్షల 16వేల రూపాయలు విలువచేసే నకిలీ పొటాష్ ఎరువులను విజిలెన్స్ అధికారులు, త్రిపురాంతకం పోలీసులు పట్టుకుని నకిలీ పొటాష్ ఎరువులను త్రిపురాంతకం పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌లో ఉంచినట్లు అడిషనల్ ఎస్‌పి తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సీఐ టిఎక్స్ అజయ్‌కుమార్, విజిలెన్స్ అధికారులు త్రిపురాంతకం పోలీసులు వెంకయ్య, ఎఓ ఉమాపతి తదితరులు ఉన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడిపిన
32మంది వాహన చోదకులకు జైలు శిక్ష
ఒంగోలు, జనవరి 11: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన మొత్తం 32 మంది వాహనచోదకులకు జైలుశిక్ష విధించినట్లు ఒంగోలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ డిఎస్‌పి కె వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. తాము చేపట్టిన తనిఖీల్లో 207 మందిని మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిగా గుర్తించి, వారిపై ఎంవి యాక్ట్ సెక్షన్ 185 (ఎ) ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారితో పాటుగా పెండింగ్‌లో వున్న 183 మందిని కోర్టులో హాజరుపరచగా, 32 మంది వ్యక్తులకు, డ్రంకన్ డ్రైవర్లకు జైలు శిక్ష, మిగిలిన వారికి జరిమానా విధించినట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ డ్రంకన్ డ్రైవ్ కేసులో మొత్తం 2,80,200 రూపాయలు కోర్టు వారు జరిమానాగా విధించినట్లు డిఎస్‌పి తెలిపారు.