క్రైమ్/లీగల్

మేఘాలయ గని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: మేఘాలయలో గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులను రక్షించేందుకు భారత నౌకాదళం రిమోట్ ద్వారా పనిచేసే ఐదు వాహనాలను వినియోగిస్తోందని ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గత నెల 13వ తేదీన రాష్ట్రంలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో నదీతీరంలోని గనిలో ఈ ప్రమాదం సంభవించింది. ఇంతవరకు ఒక కోటి లీటర్ల నీటిని బయటకు తోడారని ధర్మాసనానికి రాష్ట్రప్రభుత్వం తెలిపింది. ఈ కేసును జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ విచారించారు. పక్కనే ప్రవహిస్తున్న నది నుంచి నిరంతరం నీరు ఊరడం వల్ల గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడం అసాధ్యంగా మారిందన్నారు. అక్రమ గనిని నిర్వహిస్తున్న యాజమానిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అన్నిరకాల చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. భారత వైమానిక దళం హెలికాప్టర్లు, విమానాలను కూడా రంగంలోకి దింపి సహాయక చర్యలను చేపట్టినట్లు చెప్పారు. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రకృతి విపత్తు యాజమాన్య సహాయక బృందానికి చెందిన 71 మంది ఈ ఆపరేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది.