క్రైమ్/లీగల్

జర్నలిస్టు హత్యకేసులో డేరాబాబా దోషే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచ్‌కుల, జనవరి 11: జర్నలిస్టు హత్యకేసులో డేరాబాబా(51) దోషి అని సీబీఐ కోర్టు శుక్రవారం నిర్ధారించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరోముగ్గురు సైతం దోషులేనని పేర్కొంది. అయితే వీరికి ఎంతకాలం శిక్ష వేసేది ఈనెల 17న ప్రకటిస్తామని కేసును విచారించిన సీబీఐ జడ్జి జగదీప్ సింగ్ ప్రకటించారు. డేరాబాబా అలియాస్ డేలా సచ్చ ఔదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ సిర్సాలోని తన ఆశ్రమంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని, ఆశ్రమంలోని మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని పేర్కొంటూ జర్నలిస్టు ఛత్రపతి తన పత్రిక ‘పూరా సచ్’లో వార్తలు రాసాడు. దీంతో ఛత్రపతిని అక్టోబర్ 2002లో ఆయన ఇంటి బయట డేరాబాబా, అతని అనుచరులు కులదీప్ సింగ్, నిర్మల్ సింగ్, కిషన్‌లాల్ కలిసి కాల్చి చంపారు. దీనిపై 2003లో కేసు నమోదైంది. తర్వాత దానిని 2006లో సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా డేరాబాబాను పేర్కొంటూ కేసు నమోదైంది. శుక్రవారం జరిగిన విచారణకు డేరాబాబాను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారించగా, మిగిలిన ముగ్గురు కోర్టుకు హాజరయ్యారు. ఇలావుండగా తన ఆశ్రమంలోని ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై గతంలోనే డేరాబాబాకు 20 ఏళ్ల శిక్ష పడటంతో ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.