క్రైమ్/లీగల్

ఆస్థానాపై విచారణ కొనసాగించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరిస్తూ, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోరాదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. అతనిపై సీబీఐ కేసు విచారణను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. అంతేకాకుండా అవినీతి ఆరోపణలపై తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేందర్‌కుమార్, మధ్యవర్తి మనోజ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ నజ్మీ వాజిరి కొట్టివేస్తూ కేసులోని వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ఆస్థానా, కుమార్‌లను ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఆస్థానా, ఇతరులకు సంబంధించిన ఈ కేసులను పదివారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. మాంసం ఎగుమతిదారు ఖురేషిపై నమోదైన కేసులో తనను తప్పించేందుకు ఒక మధ్యవర్తి ద్వారా ఆస్థానాకు తాను లంచం ఇచ్చినట్టు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సాన సతీష్‌బాబు ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్, మధ్యవర్తి మనోజ్‌కుమార్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. తర్వాత సీబీఐలో ఉన్నత స్థానాల్లో ఉన్న అలోక్‌వర్మ, ఆస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. అలోక్‌వర్మపై అవినీతి, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ ఆస్థానా, కుమార్, వర్మ, జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ తదితరులను అక్టోబర్ 22న అరెస్టు చేయగా, అక్టోబర్ 31న బెయిల్ వచ్చింది. సీబీఐ దాఖలు చేసిన పలు పిటిషన్లకు సంబంధించిన తీర్పును జడ్జి వాజిరి గత ఏడాది డిసెంబర్ 20న రిజర్వ్ చేశారు. తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లు కొట్టివేయాలని నిందితులు దాఖలు చేసిన అభ్యర్థనలు జడ్జి శుక్రవారం కొట్టివేస్తూ దర్యాప్తును కొనసాగించాలని సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.