క్రైమ్/లీగల్

రూ.45లక్షల చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 11: తిన్నింటి వాసాలు లెక్కగట్టి కటకటాలపాలైన ఉదంతం రాయదుర్గం పోలీసు పరిధిలోని చోటు చేసుకుంది. డ్రైవర్‌గా 23 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. నమ్మకంగా ఉంటున్నాడని ఇల్లును అప్పచెప్పితే ఇంట్లో ఉన్నదంతా ఉడ్చేసిన ఘనుడి ఉదంతం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేటకు చెందిన కుంట బాలరాజు అలియాస్ బాలయ్య(43) సుచిత్ర సమీపంలో రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని వీస్పార్ వాలీలో నివాసం ఉంటున్న లింక్‌వెల్ టెలిసిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ యజమాని అనుమూరి కృష్ణప్రసాద్ వద్ద డ్రైవర్‌గా బాలరాజు పని చేస్తున్నాడు. 23 సంవత్సరాల నుంచి పని చేస్తుండడంతో కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు బాగా నమ్మారు. ఇంటి పోర్టుకో నిర్మాణం పనులు జరుగుతుండడంతో బాలరాజుని గోడలకు నీళ్లు కొట్టె పనిని అప్పగించారు. ఇంటికి బయోమోట్రిక్ తాళం సౌకర్యం ఉన్నప్పటికీ నిందితుడు యజమాని తాళం తీసి వేయకుండా ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించి రూ.45లక్షలు చోరీ చేశాడు. 4న రూ.25లక్షలు 8న రూ.20లక్షలు రూపాయలను చోరీ చేసి తన బావమరిది ఇంటికి చేర్చాడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలసి ఉండడంతో డబ్బుల కోసం బీరువా తేరి చూడగా లేకపోవడంతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో ఇంట్లో పని చేస్తున్న వారందరిని ప్రశ్నించారు. అక్రమంలో బాలరాజు చెప్పిన మాటలో అనుమానం వచ్చి తమదైన శైలిలో ప్రశ్నిస్తే చోరీ చేసింది తనేని ఒప్పకున్నాడు. డబ్బును బావమరిది ఇంట్లో దాచినట్లు వివరించగా పోలీసులు మొత్తం డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల క్రితమే నిందితుడు సుచిత్ర సమీపంలో ఇల్లు కట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమానులు పట్టించుకోకపోవడంతో అప్పుడప్పుడు తన చేతివాటం ప్రదర్శించి ఉండవచ్చుని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడి నుంచి రూ.45లక్షల స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం సీఐ రాంబాబు తెలిపారు. క్రైం సిబ్బంది, అదనపు సీఐ విజయ్ కుమార్‌ని అభినందించారు.