క్రైమ్/లీగల్

సెల్‌ఫోన్ దొంగను పట్టించిన హాక్ ఐ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సెల్‌ఫోన్ దొంగలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఖరీదైనా ఫోన్లను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. బహదూర్‌పురా కిషన్‌భాగ్ మహామూద్‌నగర్‌కు చెందిన ఫయాజుల్లా ఖాన్ అలియాస్ ఫయాజ్(38) సికింద్రాబాద్‌లో పాత దుస్తుల బిజినెస్ చేస్తున్నాడు. ఇతడు తల్లిదండ్రులను చిన్న తనంలోనే కోల్పోయాడు. పాతబట్టల వ్యాపారంతో పాటు ఆటోలో అల్లం, వెల్లుని విక్రయించేవాడు. పేకాటతో పాటు మద్యం సేవించడం అలవాటు కలిగిన ఫయాజ్ పేరు మోసిన దొంగ. ఫయాజ్ అతని స్నేహితుడు షేక్ అహ్మద్‌తో కలిసి 2014 నుంచి 2016 వరకు చాదర్‌ఘాట్, బేగంపేట్, చిక్కడపల్లి, ఎల్‌బీనగర్ పోలీస్టేషన్‌ల పరిధిలోని ఆరు ఇళ్ల్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనానికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను నిందితులు మధ్యాహ్నం సమయంలో గుర్తించి రాత్రివేళాల్లో అక్కడ చోరీలకు పాల్పడ్డాడు. చంచల్‌గూడా జైలుకు వెళ్లి 2017 జూన్‌లో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన రెండు నెలల కాలంలో శంషాబాద్, ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు పోలీస్టేషన్ పరిదిలో దొంగతనలు చేసి పోలీసులకు చిక్కాడు. నల్గొండలో కూడా ఫయాజ్‌పై కేసులు ఉన్నాయి. గత సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన బీరంగూడ వద్ద రామచంద్రపూరంలో ఉన్న బిగ్‌సీ మొబైల్స్ షోరూం వెనుక భాగం నుంచి కన్నం పెట్టి 35 ఖరీదైన సెల్‌ఫోన్లను చోరీ చేశారు. శనివారం అబిడ్స్ పోలీస్టేషన్ పరిధిలోని ప్రైవేట్ మార్కెట్లో వీటిని విక్రయించేందుకు ప్రయత్నించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హాక్ ఐ యాప్ ద్వారా ఈ ఫోన్లను గుర్తించామని సీపీ తెలిపారు. హాక్ ఐ యాప్‌ను తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలోని 60 పోలీస్టేషన్లకు 34 చోట్ల సీసీ కెమెరాలను వీక్షించే పీవీఎస్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. మరో రెండు నెలల్లో మిగిలిన పోలీస్టేషన్‌ల్లో కూడా వీటిని పూర్తి చేయనున్నటు వివరించారు. వాణిజ్య, విద్యా, వైద్య కేంద్రాల్లో సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని సీపీ అంజనీ కుమార్ కోరారు.