క్రైమ్/లీగల్

ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జనవరి 12: అమృత్‌సర్ జిల్లాలో శనివారం చోటు చేసుకున్న ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. జిల్లాలోని వాలా గ్రామం వద్ద శనివారం తెల్లవారు జామున ఒక ట్రాక్టర్ పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న గృహ నిర్మాణ కార్మికుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి, చికిత్స జరుపుతున్నట్టు అమృత్‌సర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జస్‌ప్రీత్ సింగ్ ప్రకటించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.