క్రైమ్/లీగల్

వృద్ధుడిని కొట్టి చం న యువకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్గార్, జనవరి 12: పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడనే ఆగ్రహంతో కొంత మంది యువకులు ఒక వృద్ధుడిని తీవ్రంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన మహారాష్ట్ర పల్గార్ జిల్లాలోని వసాయ్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్ర రావత్ అనే 70 వృద్ధుడు ఇటీవలే కొంతమందిపై దొంగతనం కేసు పెట్టాడు. తాను పెంచుకుంటున్న పావురాలను వారు దొంగించారని ఆరోపించారు. అయితే, తమపై కేసు పెట్టడాన్ని సహించలేకపోయిన వారు మరికొందరితో కలిసి రామచంద్రపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ఆసుపత్రికి తరలించేలోగా అతను మృతి చెందాడు. ఈ సంఘటనలో మొత్తం తొమ్మిది మందిని ముద్దాయిలుగా పేర్కొంటూ వారిపై ఐపీసీ 302 (హత్య), 452 (దాడి చేయాలన్న ఉద్దేశంతో ఇంట్లోకి చొరబడడం), 143 (చట్టాలకు వ్యతిరేకంగా జట్టు కట్టడం), 504 (ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, దీనిని మూక దాడిగా పరిగణించడానికి వీల్లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.