క్రైమ్/లీగల్

10 లక్షల పరిహారమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దొంగతనం కేసులో తనను అకారణంగా అరెస్టు చేశారని, అందుకు పది లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ ఒక మహిళ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముంబయి పోలీసులకు నోటీసులు జారీచేసింది. 2017లో జరిగిన ఒక దొంగతనం కేసులో అంధేరి సబర్బన్ డిఎన్ నగర్ పోలీసులు సెప్టెంబర్ 5న తనపై అకారణంగా చార్జిషీట్ దాఖలు చేసి రాత్రంలో కస్టడీలో ఉంచారని, ఇది తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ 55 ఏళ్ల మహిళ తరపు లాయర్ కరీమ్ పఠాన్ వాదించారు. ఆమెను 2018 సెప్టెంబర్ 7న మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా బెయిల్ మంజూరయిందని వివరించారు. ఈ విధంగా తన ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినందున తనకు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ మహిళ బోంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసు శాఖకు నోటీసులు జారీచేసింది. రెండు బంగారు గొలుసుల దొంగతనం కేసులో అక్టోబర్ 2017న డీఎన్ నగర్ పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు. అయితే ఆ దొంగతనంతో తనకు సంబంధం లేదని ఆ మహిళ వాదిస్తోంది.