క్రైమ్/లీగల్

జగన్‌పై దాడి కేసులో.. ఎన్‌ఐఏ కస్టడీకి నిందితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. విశాఖ జైలు నుంచి విజయవాడ తీసుకొచ్చిన అధికారులు ఇక్కడి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి ఆదేశాలతో విజయవాడ జిల్లా జైలులో రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. కాగా కోడికత్తి కేసులో పూర్తి సమాచారం రాబట్టేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అధికారులకు అనుమతి లభించడంతో శనివారం జిల్లా జైలుకు వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు సూపరింటెండెంట్‌ను కలిసి కోర్టు ఆదేశాలను అందజేశారు. అనంతరం జైలు నుంచి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించాక నిందితుడిని హైదరాబాద్ తీసుకెళ్లారు. ఎన్‌ఐఏ అధికారులు శ్రీనివాసరావును కస్టడీకీ తీసుకునేందుకు జైలు వద్దకు చేరుకోగానే భద్రత కోసం స్పెషల్ పార్టీ పోలీసులు జైలు వద్ద మోహరించారు. జైలు నుంచి ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు నగరం దాటేవరకూ స్థానిక పోలీసుల ఎస్కార్ట్ కొనసాగింది.
నిందితుని తరపు న్యాయవాది పిటిషన్
ఇదిలావుండగా, శ్రీనివాసరావును కస్టడీకి తీసుకుని హైదరాబాద్ తరలించే ప్రక్రియ శనివారం కొనసాగుతుండగానే ఊహించని రీతిలో నిందితుడు శ్రీనివాసరావు తరపున విశాఖలో పనిచేసిన న్యాయవాది సలీమ్ విజయవాడ వచ్చారు. తన క్లైంట్‌ను కస్టడీకి తీసుకోనున్న సందర్భంగా ఎన్‌ఐఏ అధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదని, ఎక్కడి తీసుకెళ్లారో కూడా తెలియచేయలేదని ఆయన మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది సమక్షంలో విచారించాల్సి ఉండగా తన క్లైంటును కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం న్యాయమూర్తి పరిశీలనలో ఉంది.
అయితే విజయవాడలో మొత్తం ప్రక్రియ పూర్తి చేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు నిందితుడిని హైదరాబాద్ తరలించి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖ విమానాశ్రయానికి కూడా నిందితుడిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
చిత్రం..నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్న ఎన్‌ఐఏ సిబ్బంది