క్రైమ్/లీగల్

మరో ముగ్గురి హత్యకు కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, జనవరి 12: ఓ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఓ కుటుంబం వేసిన ఎత్తగడ బెడిసికొట్టింది. మరో ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడం ద్వారా మెడకు చుట్టుకున్న హత్య కేసు నుంచి బయటపడాలన్న వారి పథకం చివరి క్షణంలో విఫలమైంది. సినీఫక్కీలో సాగిన ఈ వ్యవహారాన్ని ఛేదించిన పోలీసులు నిందితులను కటకటాల వెనక్కు పంపారు. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్‌ను తరలించే ఈ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. బేతంచెర్ల సీఐ ఓబులేసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన డాక్టర్ పోచా శ్రీకాంత్‌రెడ్డి 2018 మే 10న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మురారి నరసింహులు, అతని భార్య నాగరత్నమ్మ, కుమారుడు చంద్రశేఖర్ ముద్దాయిలుగా ఉన్నారు. వీరిని బంధువులు దూరంగా పెట్టారు. దీంతో వీరు బేతంచెర్లకు మకాం మార్చారు. ఆర్థిక ఇబ్బందులు సైతం చుట్టుముట్టాయి. కేసులో శిక్ష తప్పదని భావించిన వీరు దాని నుంచి బయటపడేందుకు ఓ ఎత్తుగడ వేశారు. మరో ముగ్గురిని చంపి తామే ఆత్యహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించడం ద్వారా కేసు నుంచి బయటపడవచ్చని పథకం రూపొందించారు. ఈ క్రమంలో తమ వయసు గల టీచర్ మద్దమ్మ, చెత్తపేపర్లు సేకరించే మోహన్, ముద్దవరం విజయ్‌కి మత్తు ఇచ్చి పెట్రోలు పోసి అంటించి ఆనవాళ్లు లభించకుండా చేసి తామే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌నోట్ ద్వారా తెలియజేసి తప్పించుకోవాలని చూశారు. డిసెంబర్ 26వ తేదీ రేమట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు మద్దమ్మను అప్పుగా డబ్బు ఇస్తామని, మోహన్‌కు హోటల్ పెట్టి ఉపాధి చూపిస్తామని, బేతంచెర్లకు చెందిన విజయ్‌ని ఒకరికి తెలియకుండా మరొకరిని బేతంచెర్లలోని తమ ఇంటికి పిలిపించారు. మత్తుగుళికలు ఇవ్వడంతో మద్దమ్మ, మోహన్ స్పృహకోల్పోయారు. చివరగా విజయ్‌ని అత్యవసర పని ఉందని పిలుచుకుని వచ్చి టీ, మజ్జిగలో మత్తుగుళికలు కలిపి తాగించారు. విజయ్ సైతం సృహ కోల్పోవడంతో ముగ్గురినీ గదిలో బంధించారు. అర్ధరాత్రి ముగ్గురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాలని నిర్ణయించారు. అంతవరకు సినిమా చూసి వద్దామని ముగ్గురు వెళ్లారు. అయితే మధ్యం తాగి ఉన్న విజయ్‌పై మత్తుగుళికలు పనిచేయకపోవడంతో కొద్దిసేపటికి మెళకువ వచ్చి చూడగా గదిలో బంధీగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే మిత్రులకు సమాచారం అందించాడు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న మిత్రులు గది తలుపులు పగులగొట్టి చూడగా లోపల విజయ్‌తో పాటు ఇద్దరు సృహ లేకుండా ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని వైద్య చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బాధితులు తేరుకున్న తరువాత జరిగింది తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. నిందితుల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. శనివారం మద్దులేటిస్వామి క్షేత్ర పరిసరాల్లో ముగ్గురు నిందితులు నరసింహులు, నాగరత్నమ్మ, చంద్రశేఖర్‌ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వారు దొంగిలించిన టీచర్‌కు చెందిన బంగారు కమ్మలు, రింగు, వెండిపట్టీలు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను డోన్ కోర్టులో హజరుపరిచినట్లు సీఐ తెలిపారు.
చిత్రం..నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ ఓబులేసు