క్రైమ్/లీగల్

గోదావరిలో ఇరువురు యువకులు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, జనవరి 12: పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని బల్లిపాడు గ్రామంలో గోదావరి నదిలో దిగి ప్రమాదవశాత్తూ ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి. కొడమంచిలి రాఘవ (రఘు) (16), చదలవాడ అభిషేక్ (15) అనే యువకులు గోదావరి నది అవతలి తీరానికి వెళ్లి వస్తూ స్నానం చేసేందుకు నీటిలో దిగారు. ఈ నేపధ్యంలో రాఘవ నీటిలో మునిగిపోతుంటే అభిషేక్ రక్షించబోయి ఇద్దరూ నీటిలో మునిగిపోయినట్టు పోలీసుల సమాచారం. రాత్రి సమయం వరకూ నీటిలో గాలించగా రాఘవ మృతదేహం లభించింది. తాళ్లపూడి ఎస్సై కెవై దాసు ఆధ్వర్యంలో ఇంకా గాలిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు,.