క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: నగరంలో మరో సారి ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో ఒకరి మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మియాపూర్-2 డిపోకు చెంది న ఆర్టీసీ బస్సు (ఏపీ11 జెడ్ 6671) జేఎన్‌టియూ నుంచి సికింద్రాబాద్‌కు వస్తోంది. సాయంత్రం 6 గంటల ప్రాం తంలో క్లాక్ టవర్ వద్ద అదుపు తప్పింది. మెట్రోపిల్లర్‌కు ఢీ కొట్టింది. తరువాత ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టుకుంటూ సుమారు ఆర కిలోమీటరు దూసుకుపోయింది. ప్రమాదంలో గుర్తుతెలియని యాచకుడు మృతి చెందాడు. అలాగే ప్రశాంత్ థియేటర్ వద్ద నిలిచి ఉన్న ఆటోను ఢీ కొనడంతో బోయినపల్లికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆలేరుకు చెందిన దానమ్మ, ద్విచక్రవాహనదారుడు శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒంగోలుకు చెందిన పద్మజా రాణి, భాస్కర్ రావు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివాహ ఆహ్వాన పత్రికలు పంచేందుకు అమీర్‌పేటకు వెళ్తున్న వీరు రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న బస్సును గమనించి కారులో నుంచి దిగి వెళ్లిపోవడంతో తప్పించుకోగలిగారు. గోపాలపురం, మార్కెట్ పోలీస్టేషన్లకు చెందిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ అహ్మద్‌ను అదుపులోనికి తీసుకున్నారు. గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రాలు.. నుజ్జు నుజ్జయన వాహనాలు .. *బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు *వివరాలు సేకరిస్తున్న పోలీసులు