క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో విద్యుత్ ఏఈ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, మార్చి 16: స్థానిక నరసరావుపేట రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవర అమరలింగం (45) విద్యుత్ ఏఈ మృతి చెందారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యుత్ ఏఈగా పనిచేస్తున్న మృతుడు వినుకొండకు సమీపంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఉదయం రైలులో మార్కాపురం వెళ్ళి సాయంత్రం వినుకొండకు చేరుకుని, మోటార్ సైకిల్ స్టేషన్ వద్ద ఉంచిన తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా వెనుక నుండి వచ్చిన మహీంద్రా వాహనం ఢీకొనడంతో కిందపడ్డాడు. అయినప్పటికీ వాహనం అదుపుకాకపోవడంతో క్షతగాత్రుడిని ఈడ్చుకునిపోయింది. చుట్టుపక్కల వారు హుటాహుటిన క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వినుకొండ ఎస్‌ఐ చినరామయ్య కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.