క్రైమ్/లీగల్

కారు చెట్టుకు ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకులపల్లి, మార్చి 16: దైవ దర్శనం ముగించుకొని కాసేపట్లో ఇంటికి చేరుకునే సమయంలో అకస్మాత్తుగా కారు చెట్టుకు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో మరో ఐదుగురికి తీవ్రగాయాలయిన సంఘటన శుక్రవారం తెల్లవారు జామున మండల పరిధిలోని సీతారాంపురం సమీపాన జరిగింది. టేకులపల్లి పోలీసుల కథనం ప్రకారం కొత్తగూడెం పట్టణానికి చెందిన చిలక పురుషోత్తం (60) ఆయన భార్య విజయలక్ష్మీతో పాటు వారి బంధువులతో వేములవాడకు ఎర్టిగా కారులో కిరాయికి వెళ్లి దైవదర్శనం పూర్తి చేసుకొని మరో పది కిలోమీటర్లు వెళ్లితే కొత్తగూడెం వారి ఇంటికి చేరుకునేలోపు సీతారాంపురం గ్రామ సమీపాన రోడ్డు ప్రక్కన గల చెట్టుకు కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. దీంతో పురుషోత్తం అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ గుండా నర్సింహారావుతోపాటు కారులో ప్రయాణిస్తున్న మృతుడు భార్య విజయలక్ష్మీకి, కుమారుడు సంపత్ కుమార్‌కు, బంధువులు రమాదేవి, సరిత, సబ్రమణ్యంలకు తీవ్రగాయాలయ్యాయి. వారందరినీ కొత్తగూడెం వైద్యశాలో చికిత్స పొందుతున్నారు. ఎస్ ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.