క్రైమ్/లీగల్

మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, జనవరి 16 : మండల పరిధిలోని మరవపల్లిలో చెరువులో మట్టి తోడుతుండగా పెళ్లలు విరిగిపడి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి(35), వెంకటేశులు (30) మృతి చెందారు. రోజూ మాదిరిగానే బుధవారం ఇద్దరూ కలిసి మట్టి తోడుతుండగా అకస్మాత్తుగా మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. దీంతో ఇద్దరూ ఊపిరి ఆడక మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీకే పార్థసారధి గ్రామానికి వెళ్లి ఆయా కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి చంద్రన్న బీమా పథకం కింద రూ.5 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే వైకాపా నాయకులు శంకరనారాయణ మృతదేహాలను సందర్శించి కుటుంబాలను పరామర్శించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కణేకల్లు, జనవరి 16 : మండల పరిధిలోని జక్కలవడికి గ్రామానికి పోతిబోయ సీమక్కగారి వన్నూర్ స్వామి (29) బుధవారం ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వన్నూర్ స్వామి 9 సంవత్సరాల నుంచి మానసిక, మూర్చవ్యాధితో బాధపడుతుండేవాడు. చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఉదయం 6 గంటల మధ్యకాలంలో హరిజన కాడప్ప పొలంలో మల్లమ్మ బావిగట్టుపై ఉన్న చింతచెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు తల్లి అంజనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గార్లదినె్న, జనవరి 16 : శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన ఆదెన్న (45) బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. మృతుడు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. ఈనేపథ్యంలో గత 13వతేదీన మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో కడుపునొప్పి తాళలేక పురుగు మందు తాగాడు. చికిత్స కోసం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడి మృతి
ఓబుళదేవరచెరువు, జనవరి 16: కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి, విప్ పల్లె వ్యక్తిగత సోషల్ మీడియా ఇన్‌చార్జి తోట గురివిరెడ్డి (25) మంగళవారం మృతి చెందాడు. ఈ నెల 11వ తేదీ సొంత పనుల నిమిత్తం నల్లమాడకు వెళ్తుండగా చౌటకుంటపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. అనంతరం చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు అనంతపురం సవేరా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అదే ప్రమాదంలో కొండకమర్లకు చెందిన షామీర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. గురివిరెడ్డి మృతి విషయం తెలుసుకున్న చీఫ్ విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎంపీపీ ఇస్మాయిల్, జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, టీడీపీ నాయకులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.