క్రైమ్/లీగల్

క్వారీలో దూకి వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ రూరల్, జనవరి 16: ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి మండల పరిధిలోని తోగ్గూడెం క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఆ గ్రామంలో విషాదం నింపింది. అంతకు ముందు తోగ్గూడెం క్వారీలలో జరిగిన ఒక ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడన్న సంఘటన మరువకముందే మరో యువకుడు క్వారిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం తోగ్గూడెం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు, గ్రామస్థులు, మృతుని బంధువులు అందించిన సమాచారం మేరకు మండల పరిధిలోని తోగ్గూడెం తండా గ్రామానికి చెందిన గుగులోతు దేశిరాం(22) తన కుటుంబ పోషణార్దం లారీ క్లీనర్‌గా పనిచేస్తుండే వాడు. అయితే గత సంవత్సరం మే నెలలో ములకలపల్లి మండలంలోని పూసుగ్గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేశిరాం తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో దేశిరాం ఒక కాలు పూర్తిగా మరో కాలు పాక్షికంగా దెబ్బతినడంతో పూర్తిగా దెబ్బతిన్న కాలును వైద్యులు తొలగించి మరో కాలుకు స్టీల్ రాడ్డు అమర్చారు. ప్రమాదంలో గాయపడిన దేశిరాంకు రెండవ పార్టీ నష్టపరిహారం కింద రూ.2లక్షల 50వేల చెక్కును లారీ యజమానికి అందజేసి ములకలపల్లి పోలీసుస్టేషన్‌లో ఉన్న కేసును దేశిరాం ఉపసంహరించుకుంటే అతనికి చెక్కును అందజేయాలని కోరడంతో లారి యజమాని కూడా అనేక సార్లు దేశిరాంకు కేసును ఉపసంహరించుకొని వస్తే చెక్కు ఇస్తానని తెలపడం జరిగిందన్నారు. అసలే రెండు కాళ్ళను పోగొట్టుకున్న దేశిరాం లారీ యజమాని ఇంటి చుట్టూ తిరగలేక, కుటుంబంలో వస్తున్న ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేక ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో సంక్రాంతి పండుగ నాడు జీవితం మీద విరక్తి చెందిన దేశిరాం గ్రామంలో ఉన్న ఒక క్వారీ వద్దకు ట్రైసైకిల్‌పై వెళ్లి క్వారీ పైనుంచి నీళ్ళలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశిరాంను గుర్తించిన స్ధానికులు సమాచారాన్ని అతని బంధువులకు అందజేయడంతో క్వారీ వద్దకు చేరుకున్న బందువులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మృతునికి రావాల్సిన రూ.2లక్షల 50వేల చెక్కును అతని భార్య దుర్గాకు అందజేయాలని టిడిపి నాయకులు కళ్యాణం లక్ష్మిపతి, పాటిబండ్ల అభినవ్, మోహన్, మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. మృతుని భార్య దుర్గా ఇచ్చిన సమాచారం మేరకు పాల్వంచ రూరల్ ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.