క్రైమ్/లీగల్

స్పీకర్‌కు ఆ అధికారం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: తమ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఏ సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. స్పీకర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పిటీషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ విషయమై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి హైకోర్టును కోరారు. దీంతో కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. తమ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు లేదని పిటీషనర్ల తరఫున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సహజ న్యాయ సూత్రాలకు స్పీకర్ విరుద్ధంగా నడుచుకున్నారని వాదించారు. రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించినందుకు తమ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. సభ్యత్వం రద్దును ఎథిక్స్, ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయలేదని పిటీషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వీడియో ఫుటేజి చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయని పిటీషనర్ల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై శాసనసభ కార్యదర్శిని ఆదేశించాలని పిటీషనర్ల తరఫున న్యాయవాది అభ్యర్థించారు. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్ రావు పేర్కొన్నారు.