క్రైమ్/లీగల్

మాతృగర్భం నుండి మహాప్రస్థానానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 17: కళ్లుతెరచి కొత్త ప్రపంచానికి పరిచయమవ్వాల్సిన పసికందు మాతృగర్భం నుండి బయటకు వస్తూనే కనుమూసేసింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ చనిపోయిందంటూ పసికందు కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గురువారం నగరంలోని ప్రభుత్వ ప్రధానసుపత్రి ప్రాంగణంలోని జూబ్లీ ఆసుపత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో పాటు సేకరించిన సమాచారం మేరకు.. రవికుమార్, సోను దంపతులు నగర శివార్లలోని కొత్తూరులో నివాసం ఉంటున్నారు. సోను నిండు గర్భిణీ. ప్రసవ సమయం దగ్గరపడడంతో ఆమెను కుటుంబీకులు జూబ్లీ ఆసుపత్రిలో ఈనెల 14వ తేదీన చేర్పించారు. అప్పట్నుంచి అక్కడే ఉంటున్న ఆమెకు బుధవారం రాత్రి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే వైద్య సిబ్బంది ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని, సోను కుటుంబీకులకు తెలియచేయగా వారి అంగీకారంతో ఆపరేషన్ పూర్తిచేశారు. అర్ధరాత్రి (తెల్లవారితే గురువారం) 2.10 గంటలకు సోను బిడ్డ పుట్టిందని చెప్పిన వైద్యులు అదే బిడ్డ చనిపోయిందంటూ 4.10లకు సోను బంధువులకు గుడ్డలో పసికందు మృతదేహాన్ని చుట్టి అందించారు. ఖననం చేసేందుకు ఇంటికి తీసుకెళ్లి గుడ్డ తీసిన కుటుంబ సభ్యులు పసికందు తలచుట్టూ రక్తస్రావం జరిగి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కత్తి గాయాలై తమ బిడ్డ చనిపోయిందంటూ ఆసుపత్రి ఎదుట బిడ్డ మృతదేహంతో ధర్నాకు దిగారు. పలు సంఘాలు కూడా వీరికి మద్దతు పలకడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే తాము ఎటువంటి నిర్లక్ష్యం చేయలేదని, బిడ్డకు ఊపిరితిత్తులు కూడా ఓపెన్ కాకపోవడంతో కాసేపు ఇంక్యుబేటర్‌లో పెట్టి ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న దర్గామిట్ట ఇన్‌చార్జ్ సిఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై పూర్ణచంద్రరావులు రవికుమార్ ఇతర బంధువులతో చర్చించి కేసు నమోదు చేస్తామని, ఆందోళన విరమించాలని సూచించి ఎట్టకేలకు వారిని ఒప్పించారు. పసికందు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి రవికుమార్‌కు అప్పగించారు. సోను కుటుంబీకుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.