క్రైమ్/లీగల్

1.5 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం,జనవరి 17:మండల పరిధిలోని మాధవరం చెక్‌పోస్టు దగ్గర 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ శిరీష తెలిపారు. పెద్దకడుబూరు మండల పరిధిలోని కమ్మలదినె్న గ్రామానికి చెందిన బోయ హనుమంతు, బోయ గుర్రాజ ఇద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి కర్నాటక గిల్లేసూగూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై గంజాయి తీసుకుని వెల్తుండగా, మాధవరం చెక్ పోస్టు దగ్గర పోలీసు వాహనాలు సోదా చేస్తుండగా గంజాయి దొరికిందని, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తునట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు.
మద్యం తాగి బైక్ నడిపినందుకు
జైలు శిక్ష
తుగ్గలి, జనవరి 17 : మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతున్న పెరవలికి చెందిన గురుస్వామిని అరెస్టు చేసి పత్తికొండ కోర్టులో హాజరు పరచగా విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో గురుస్వామికి 20 రోజుల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు గురువారం తెలిపారు. కావున ఎవరూ మద్యం తాగి వాహనం నడపవద్దని హెచ్చరించారు.