క్రైమ్/లీగల్

డేరాబాబాకు యావజ్జీవ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచకుల (హర్యానా), జనవరి 17: పదహారేళ్ల క్రితం ఓ పాత్రికేయుడ్ని హత్య చేసినట్టు నేరం రుజువుకావడంతో గుర్మిత్ రామ్ రహీం సింగ్ (డేరా బాబా)కు స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. డేరాబాబాతోపాటు మరోముగ్గురికి న్యాయస్థానం శిక్ష విధించింది. మహిళలపై అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరాబాబాను గత శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది. 2002లో రామ్‌చందర్ ఛత్రపతిని డేరాబాబా హత్యచేశాడు.‘గుర్మిత్ సహా నలుగురిపై నేరం రుజువైంది. అందరికీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది’అని సీబీఐ తరఫున్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ వెల్లడించారు. ఈనెల 11న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జగ్దీప్‌సింగ్ నలుగుర్నీ దోషులుగా నిర్ధారించారని ఆయన చెప్పారు. డేరాబాబా ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది. మిగతా ముగ్గురు నిర్మల్‌సింగ్, కుల్దీప్‌సింగ్, కిషన్‌న్‌లాల్ అంబాలా జైలు నుంచి విచారణకు హాజరయ్యారు. 2002లో హర్యానాలోని సిర్సాలో జర్నలిస్టు చత్రపతి దారుణ హత్యకు గురయ్యారు. సిర్సాలోని డేరా ప్రధాన కేంద్రంలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ ఆయన వార్తలు రాశారు. సంచలనం రేపిన ఈ కేసులో డేరాబాబానే సూత్రధారిగా ఉన్నాడు. 2003లో చత్రపతి కుటుంబ సభ్యులు పంజాబ్, హర్యానా కోర్టును ఆశ్రయించారు. కేసును సీబీఐకు అప్పగించాలని వారు అభ్యర్థించారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన సీబీఐ 2007 జూలైలో చార్జిషీట్ దాఖలు చేసింది.