క్రైమ్/లీగల్

డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులపై సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: ఉమ్మడి ఏపీలో 2013లో జరిగిన డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పదోన్నతుల్లో సీనియర్లుకు అన్యాయం జరిగిందంటూ పలువురు సబ్ కలెక్టర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ మరో పిటిషన్‌ను దాఖల చేశారు. శుక్రవారం నాడు జస్టిస్ ఆర్‌కే అగర్వాల్, జస్టిస్ అభయ్‌మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇవ్వడంతో పాటు స్టే ఎందుకు ఇవ్వకూడదో తెలపాలని ఆదేశించింది. తెలుగు రాష్ట్రాలలో జీవో నంబరు 502 ద్వారా పదోన్నతుల పొందిన వారికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.