క్రైమ్/లీగల్

ఫిబ్రవరిలోగా పేర్లు సిఫార్సు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉన్నత స్థాయిలో అవినీతిని నిరోధించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు ఫిబ్రవరి చివరి వరకూ అనే్వషణ ప్యానల్‌కు గడువు ఇచ్చింది. ఈ పదవిలో నియమించేందుకు వీలుగా తమకు ఈ గడువులోగా పలుపేర్లను సిఫార్సు చేయాలని మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ సారధ్యంలోని కమిటీకి స్పష్టం చేసింది. ఈ కమిటీ తన బాధ్యతను గడవువులోగా పూర్తి చేయడానికి వీలుగా అవసరమైన సదుపాయాలు, సిబ్బందిని కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. మార్చి 7న మళ్లీ ఈ అంశాన్ని విచారణకు చేపడతామని ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని సుప్రీం బెంచి ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తగిన వౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకపోవడం వల్ల ఈ సెర్చ్ కమిటీ లోక్‌పాల్ అంశంపై సంప్రదింపులు జరుపలేకపోయిందని కేంద్రం తరపున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు నివేదించారు.