క్రైమ్/లీగల్

గుప్త నిధి అమ్మేందుకు యత్నించిన నలుగురి అరెస్ట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 17: గుప్త నిధులను తవ్వి అమ్మేందుకు యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ శిరీష రాఘవేంద్ర వెల్లడించారు.కోట్‌పల్లి మండలం నాగ్‌సాన్‌పల్లి గ్రామంలోని శ్రీనివాస్ గౌడ్‌కు చెందిన పురాతన సంగమేశ్వరాలయంలో ఈ నెల ఒకటి రెండు తేదీలలో పూజారి వెంకటేశ్ సహకారంతో ఆటో డ్రైవర్ రమేష్ తవ్వకాలు జరిపారు. పోలీసులకు సమాచారం అందడంతో మోమిన్‌పేట సీఐ బీ.శ్రీనివాస్, ఎస్‌ఐ రవికుమార్, నవాబ్‌పేట ఎస్‌ఐ కృష్ణ, కానిస్టేబుళ్లు సుజిత్, సుదర్శన్, ఫారూఖ్ బృందంగా ఏర్పడి పరిశోధన ప్రారంభించారు. గురువారం ఉదయం మోమిన్‌పేట మండల కేంద్రం సమీపంలో ఏఎన్‌ఆర్ దాబా వద్ద తవ్వకాల్లో దొరికిన వాటిని అమ్మేందుకు మధ్యవర్తి రమేష్‌తో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ బేరసారాలు సాగిస్తుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద అమ్మవారి పంచలోహ విగ్రహం, ఎనిమిది నాణేలు స్వాధీనం చేసుకున్నారు.
శఠగోపం, లోహపు బిందెను సైతం రికవరీ చేశారు. శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్, శ్రీనివాస్, రమేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా, మరో మధ్యవర్తిగా ఉన్న ఉపేందర్ గౌడ్ పరారీలో ఉన్నాడు. పురావస్తు శాఖకు వస్తువులను పంపి పరీక్షలు చేయించిన తర్వాత విలువ తెలుస్తుందని డీఎస్పీ శిరీష తెలిపారు. అత్యాశకు పోయి ఆపదలు తెచ్చుకోరాదని సూచించారు. ఎక్కడైనా గుప్త నిధులు దొరికితే ప్రభుత్వానికి సమాచారం అందించాలని లేదంటే పురావస్తు శాఖకు తెలియజేయాలని తెలిపారు.