క్రైమ్/లీగల్

మిర్చి కూలీల ఆటో బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందర్లపాడు, జనవరి 18: మిరప కోతలకు కూలీలను ఎక్కించుకొని వెల్తున్న ఆటోట్రాలీ పల్టీ కొట్టటంతో కూలీలకు గాయాలు అయిన సంఘటన మండలంలోని కాసరబాద వద్ద గురువారం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం కాసరబాద గ్రామానికి చెందిన ఆటోలో గ్రామానికి చెందిన కూలీలను ఎక్కించుకొని ఇసుక ర్యాంపు రోడ్డు దగ్గరలోని మిరప కోతకు వెల్తుండగా వెనుక నుండి వస్తున్న ఆటో ముందుకు వెల్లబొయి ఆటోను తగలటంతో ఆటో ప్రక్కన ఉన్న రోడ్డు మార్జిన్‌లోకి బొల్తా పడింది. దానిలో ఉన్న కూలీలలో కొంత మందికి స్వల్ప గాయాలు కాగా కొంత మంది తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వీరిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయాలు అయిన వారిలో ఊటుకూరి చిన్నారి, నాగమణి, మేదర సునీత, బాలు, రాజా, విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. విషయం తెలుసుకొన్న ఎస్సై సుబ్రహ్మణ్యం సంఘటనా స్థ్ధలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.