క్రైమ్/లీగల్

మాకు భద్రత కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళలు తమకు భద్రత కల్పించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ మహిళల తరఫున సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎల్‌ఎన్ రావు, ఎస్‌కే సిక్రీతోకూడిన బెంచ్ వద్ద పిటిషన్ లిస్టయింది. బిందు అమ్మణీ (40) కేరళలోని కన్నూర్ యూనివర్శిటీలో లా అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. అలాగే కనకదుర్గ (39) కూడా ఉద్యోగే. అయ్యప్ప ఆలయంలోని మహిళల ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రవేశానికి అనేక మహిళా సంఘాల కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా శబరిమలలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే బిందు, కనకదుర్గ ఉద్రిక్తతల మధ్యే శబరిమల ఆలయంలో ప్రవేశించి చరిత్ర సృష్టించారు. ఆలయ ప్రవేశం తరువాత భక్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కనకదుర్గపై కుటుంబ సభ్యులే దాడికి దిగారు. మలప్పురం జిల్లా పెరింతలమన్నా ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందింది. కాగా తమకు ప్రాణహాని ఉన్నందున రేయింబవళ్లూ భద్రత కల్పించాలని మహిళలు ఇద్దరూ సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.