క్రైమ్/లీగల్

కుటుంబం ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం జరిగిన సంఘటనకు సంబంధించి మహంకాళి పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ జనరల్ బజార్‌లో నివాస ముంటున్న ఓ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తాళలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆరేళ్ల బాలిక, ఆరు నెలల పాప సహా భార్యాభర్తలు చనిపోయి ఉన్నట్లు సమాచారం అందడంతో మహంకాళి పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. సంఘటనా ప్రదేశంలో పౌడర్ వంటి పదార్ధం లభించడంతో, విషాహారం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. సైనేడ్ మాదిరి ఉన్నందున పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని మహంకాళి ఇన్‌స్పెక్టర్ రమేష్ తెలిపారు. కుటుంబం వివరాలు, ఆత్మహత్యకు పాల్పడిన కారణం తెలియరాలేదని, విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. క్లూస్ టీం అన్ని ఆధారాలను సేకరించింది. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.