క్రైమ్/లీగల్

జింకను బలిగొన్న వేటగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, జనవరి 17: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల అడవులలో జింకను వేటాడినట్లు సమాచారం రావడంతో అటవీశాఖాధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి జంతువుల వేటగాడైన బోయ శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ క్షేత్రాధికారి మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం. సోమశిల మర్లబావి సమీపంలో ఈతవనంలో జింకను వేటాడినట్లు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇవ్వగా తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లినట్లు అక్కడ సోమశిలకు చెందిన బోయ శ్రీనివాసులు మాంసాన్ని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టుకొని తీసుకొని పోతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతమంతా రక్తంతోపాటు జంతువు వెంట్రులతో ఉందని చుట్టు ఉర్లుతో కంచె ఉందని తెలిపారు. నిందితుడైన బోయ శ్రీనివాసులుతోపాటు ఆయన వద్ద ఉన్న మాంసం కవర్‌ను స్వాదీనం చేసుకొని కొల్లాపూర్ రెంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. మాంసాన్ని పశుసంవర్ధక శాఖ వైద్యశాలకు పరీక్షల నిమిత్తం తీసుకొని పోగా అక్కడ డాక్టర్లు లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. నిందితుడైన బోయ శ్రీనివాసులు విలేఖరులతో మాట్లాడుతూ తాను వేటాడింది కొండగొర్రె అని, చుక్కల దుప్పి అని పెర్కొన్నారు. తాను ఒక్కడే ఉర్లు వేసి దానిని వేటాడినట్లు తెలిపారు. నిందితుడివెంట ఐదుకిలోల మాంసం పట్టుబడింది. మిగతా మాంసం ఎక్కడికి పోయింది, ఎంత మంది నిందితులు ఉన్నారనే దానిపై సరైన సమాధానం రావడంలేదు. ప్రజలేమో కృష్ణజింకను వేటాడినారని అనుకుంటున్నారు.
మొత్తానికి వణ్యప్రాణి ఏదో గుర్తించి అసలైన వేటగాళ్లను శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.ఇది ఇలా ఉంటే కేసును ఎలాగైనా నీరుగార్చాలని కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారు.