క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో దేవరపల్లి ఏఎస్సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, జనవరి 18: వ్యక్తిగత ఘర్షణకు సంబంధించిన కేసులో తగిన చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదుదారు అయిన మహిళ నుండి రూ.5000 లంచం తీసుకుంటూ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై) ఒకరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ ఏలూరు డీఎస్పీ వి గోపాలకృష్ణ కథనం ప్రకారం దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన మడతల నాగమణికి అదే గ్రామానికి చెందిన ప్రత్తిపాటి వెంకట్రావుతో విభేదాలున్నాయి. వారిరువురూ కోర్టును కూడా ఆశ్రయించారు. గత మూడు సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి. కాగా నాగమణి, వెంకట్రావు మధ్య ఇటీవల మళ్లీ ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై గత నెలలో నాగమణి దేవరపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై ఏఎస్సై (గతంలో రైటర్) పి సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఖర్చుల నిమిత్తం రెండు దఫాలుగా నాగమణి రూ.4000 రైటర్‌కు లంచం ఇచ్చింది. అయినా కేసు విషయం ఎటూ తేల్చలేదు.
చివరకు రూ.5000 లంచం ఇస్తే కేసు ఫైలు ముందుకు కదులుతుందని ఏఎస్సై సత్యనారాయణ నాగమణికి చెప్పారు. దీనితో నాగమణి ఏసీబి అధికార్లను ఆశ్రయించింది. బాధితురాలు నాగమణి శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో దేవరపల్లి పోలీసు స్టేషన్లో ఏఎస్సై సత్యనారాయణకు రూ.5000 లంచం ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ వివరించారు. ఏఎస్సై సత్యనారాయణను అదుపులోనికి తీసుకున్నామని ఆయన తెలిపారు.