క్రైమ్/లీగల్

డిప్యూటీ కమాండర్, కొరియర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జనవరి 18: గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం కోసం గ్రామంలోకి వచ్చిన న్యూడెమోక్రసీ అశోక్ దళం డిప్యూటి కమాండర్ పవన్‌కళ్యాణ్‌తోపాటు కొరియర్లు జక్కుల సమ్మయ్య, వాసం వెంకన్నలను అరెస్ట్‌చేసినట్లు, వారి వద్ద నుండి స్ప్రింగ్ ఫీల్డ్ ఆయుధం, 48 తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడ మండలం తాటివారి వెంపల్లి గ్రామానికి చెందిన న్యూడెమోక్రసీ దళ కమాండర్ అశోక్, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో తమవారిని గెలిపించుకునేందుకు గ్రామంలోకి వస్తున్నాడనే పక్కాసమాచారంతో ఎస్సై తహెర్‌బాబా సీఆర్‌పిఎఫ్ స్పెషల్‌పార్టీ సిబ్బందితో గాలింపు చెపట్టడం జరిగిందన్నారు. ఉదయం 6.30గంటల సమయంలో గాలింపు చేస్తున్న పోలీసులకు నక్సల్స్ దళం ఎదురుపడడం జరిగిందని సరెండర్ కావాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ నక్సల్స్ తప్పించుకొని అడవిలోకి పారిపోయారని తెలిపారు. అందులో ముగ్గుర్ని మాత్రమే పట్టుకోగలిగామని వారిలో అశోక్ దళం డిప్యూటీ కమాండర్ తాటి పవన్‌కళ్యాణ్ అలియాస్ గణేష్ అలియాస్ రాకేష్‌తోపాటు కొరియర్లు సమ్మయ్య, వాసం వెంకన్నలు ఉన్నారన్నారు. పవన్‌కళ్యాణ వద్ద స్ప్రింగ్ ఫీల్డ్ రైఫిల్‌తోపాటు 48 తూటాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
పవన్‌కళ్యాణ్ 2016లో పాకాల కొత్తగూడ ఏరియా సూర్యం దళంలో సభ్యుడిగా చేరి దాదాపు రెండు సంవత్సరాలు పనిచేశాడన్నారు. తర్వాత బయటకు వచ్చి కొంతకాలం ఇంటి దగ్గరే ఉన్నాడని తిరిగి ఎంపిటిసి వాసం వెంకన్న ప్రొత్బలంతో అశోక్‌దళంలో చేరి డిప్యూటి కమాండర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.
జక్కుల సమ్మయ్య పగిడిపల్లికి చెందిన వాడని, ఇతను 2013సంవత్సరం నుడి పాకాల కొత్తగూడ ఏరియా సూర్యం దళంకు కొరియర్‌గా పనిచేస్తూ 2016సంవత్సరంలో దళంలోకి వెళ్లిపోయాడని దళ కమాండర్‌స్థాయికి ఎదిగాడన్నారు. 2017నవంబర్ 10వ తేదీన అప్పటి కొత్తగూడ ఎస్సై సతీష్ ఇతన్ని అరెస్ట్ చేశారని ఇతనితోపాటు ఐదుగురు సభ్యులు, ఆరు తుపాకులతో అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఆయుధ చట్టం కింద జైలుకు పంపడం జరిగిందని, జైలు నుండి బయటకు వచ్చి ప్రస్తుతం బయ్యారం ఏరియా ఆశోక్ దళంకు కొరియర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. వాసం వెంకన్న గతంలో కొత్తగూడ ఏరియా కమాండర్ సూర్యంకు కొరియర్‌గా పనిచేస్తూ 2012లో ఆరు నెలల పాటు దళ సభ్యునిగా పనిచేశాడన్నారు. తర్వాత ఇంటికి వచ్చి ఎంపిటిసిగా గెలిచాడని కొరియర్‌గా పనిచేస్తున్నాడన్నారు. జక్కుల సమ్మయ్యతో కలసి కార్లాయి అడవిలో దళంను కలసి అట్టి దళాన్ని తీసుకొని గ్రామపంచాయితీ ఎన్నికల్లో న్యూడెమోక్రసీ పార్టీని గెలిపించడానికి దళనేత అశోక్‌తో మీటింగ్‌నిర్వహించడానికి తాటివారి వెంపల్లికివస్తూ ఈ ముగ్గురు పోలీసులకు చిక్కారని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. మిగతా దళం తప్పించుకొని పారిపోయాందన్నారు.
డిప్యూటి కమాండర్, ఇద్దరు కొరియర్లను పట్టుకున్న ఎస్సై తహెర్‌బాబాను, వారి సిబ్బంది ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ నరేష్‌కుమార్, గూడూరు సీఐ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఏసీబీ వలలో కోదాడ ఎస్‌ఐ

కోదాడ, జనవరి 18: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ ఎస్సైగా పనిచేస్తున్న టి. మల్లేష్ లక్షా 90 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబి అధికారులు పట్టుకున్నారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీబి డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన డి. వెంకటేశ్వరరావు గత సంవత్సరం నవంబర్ నెలలో కొత్తగూడెం నుండి కర్ణాటకకు బొగ్గు తరలించే క్రమంలో బొగ్గు నాసిరకంగా ఉందని కేసు నమోదు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన నోటీసులు జారీచేసేందుకు, లారీలను వదిలేందుకు కోదాడ పట్టణ ఎస్సై కె.టి. మల్లేష్ వారిని మూడులక్షలు డిమాండ్ చేశారని తెలిపారు. లారీ యజమాని తాను అంత ఇచ్చుకోలేనని లక్షా తొంభైవేల రూపాయలకు బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వెంకటేశ్వరరావు అతని మిత్రుడు సురేష్‌లు లంచం ఇచ్చేందుకు లక్షా 90 వేల రూపాయలతో ఎస్సై దగ్గరకు వెళ్ళగా సురేష్‌ను ఎస్సై మల్లేష్ తన డబ్బుతో సహా కారులో ఎక్కించుకుని స్టేషన్ బయటకు రాగా వెంబడించి పట్టుకున్నట్లు ఏసీబి డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.