క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర మూఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రెండు పిస్టల్స్, రెండు రౌండ్ల బుల్లెట్లు, రెండు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం - మహారాష్ట్ర థానే జిల్లా బీవండి గ్రామానికి చెందిన దత్తు వీరేష్ కోలి(31) గార్మెంట్ వ్యాపారం చేసేవాడు. అదే గ్రామానికి చెందిన శ్యాం సుందర్ భూమయ్య వడ్డెపల్లి (29) ప్రవేటు వ్యాపారం చేస్తున్నాడు. వీరు ఇద్దరు స్నేహితులు. దత్తు వీరేష్ కోలికీ నేర చరిత్ర ఉంది. యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేస్తూ వివిధ రాష్ట్రాలలో విక్రయిస్తుంటాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అజంగర్‌కు చెందిన అక్రమ ఆయుధాలను సరఫరా చేసే జంషీర్ అలీయాస్ హసన్‌తో వీరేష్ కోలికీ పరిచయం ఏర్పడింది. జంషీర్ వద్ద తక్కువ ధరకు ఆయుధాలను కొనుగోలు చేసి రూ.లక్షకు ఇతర నగరాల నుంచి తనను సంప్రదించిన వ్యక్తులకు దత్తు వీరేష్ కోలి.. పిస్టల్స్, బుల్లెట్స్‌ను సరఫరా చేస్తుంటాడు. ఎల్బీనగర్‌లోని సాయి లాడ్జిలో బసచేసి తమ వెంట తెచ్చుకున్న రెండు పిస్టల్స్, రెండు రౌండ్ల బుల్లెట్లను కస్టమర్లకు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ పోలీసులు మూకుమ్మడిగా ఎల్బీనగర్‌లోని సాయి లాడ్జిపై దాడులు నిర్వహించారు. ఆయుధాలు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులైన దత్తువీరేష్ కోలి, అతనికి సహకరించిన శ్యాంసుందర్ భూమయ్య వడ్డెపల్లిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద ఉన్న రెండు పిస్టల్స్, రెండు రౌండ్ల బుల్లెట్స్, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న జంషీర్‌తో పాటు వారికి సహకరించిన ముఠా సభ్యులను త్వరలో అరెస్ట్ చేస్తామన సీపీ వెల్లడించారు.