క్రైమ్/లీగల్

బెదిరిన ఎద్దులు-చెదిరిన గుండె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, జనవరి 19: బెదిరిన ఎద్దుల వలన ఆటో వృద్దురాలు గుండెపై పడడంతో మృతి చెందిన సంఘటన గొల్లుపాలెం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొల్లుపాలెం గ్రామానికి చెందిన తొత్తడి కొత్తమ్మ(70) అనే వృద్దురాలు ఇంటి గేటు వద్ద నిలుచుని ఉండగా అదే గ్రామానికి చెందిన లగుడు అప్పలనాయుడుకు చెందిన పోతులు బండి కల్లానికి తీసుకువెళుతుండగా కొత్తమ్మ ఇంటివద్ద ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టడంతో ఆటో నిలుచుని ఉన్న కొత్తమ్మపై పడింది. దీంతో కొత్తమ్మ గుండెకు తీవ్ర గాయంకావడంతో వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కొత్తమ్మను పరీక్షించగా మృతి చెందిందని తెలిపారు. ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై సాగిరాజు కృష్ణవర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఐదుగురికి జైలు జరిమానా
బొండపల్లి, జనవరి 19: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురికి మందికి గజపతినగరం జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మున్సిప్ మెజిస్ట్రేట్ పల్లి నాగేశ్వరరావు జైలు, జరిమానా విధిస్తూ శనివారం తీర్పు చెప్పారని స్థానిక ఎస్సై సాగిరాజు కృష్ణవర్మ విలేఖరులకు తెలిపారు. ముగ్గురికి ఐదురోజులు జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయలు జరిమానా విధించగా ఇద్దరికి ఎనిమిదిరోజులు జైలు శిక్షతోపాటు వెయ్యిరూపాయలు జరిమానా విధించారని తెలిపారు.