క్రైమ్/లీగల్

హెచ్‌సీయూ విద్యార్థినిపై అత్యాచార యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 16: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)లో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థినిపై కొందరు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించి శుక్రవారం గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంఘటన హెచ్‌సియులో కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థిని, కేరళకు చెందిన సహవిద్యార్థి ప్రవీణ్ విజయ్‌తో కలిసి యూనివర్శిటీ సమీపంలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్ వద్ద మాట్లాడుకుంటుండగా బయట నుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులు ప్రవీణ్‌పై దాడి చేసి ఆమెపై సామూహిక అత్యాచార యత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో నిందితులు ప్రవీణ్‌పై దాడి చేయడంతో అతనికి కూడా స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. సంఘటన ప్రదేశం నుంచి వారు తప్పించుకుని యూనివర్శిటీకి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. అత్యాచార యత్నానికి గురైన విద్యార్థినికి యూనివర్శిటీ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు విద్యార్థిని, సహ విద్యార్థి వాంగ్మూలం తీసుకున్న తర్వాత నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సంఘటన స్ధలానికి ఏసీపీ శ్యాంప్రసాదరావు, సిఐ గంగాధర్ వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు.