క్రైమ్/లీగల్

సిమ్ కార్డు స్వైపింగ్‌తో డబ్బు లూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 19: నెట్ బ్యాంక్ లావాదేవీలు చేస్తున్నారా.. శనివారం సాయంత్రం ఫోన్ సిమ్ బ్లాక్ అయిందా.. సోమవారం ఉదయం ముందస్తుగా బ్యాంక్‌కు సంబంధించిన లావాదేవీలను నిలిపి వేయమని సంబంధిత బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వండి.. లేకపోతే క్షణాల్లో ఖాతాలో ఉన్న డబ్బు అన్‌లైన్‌లో బదిలీ అయిపోతుంది. సిమ్ కార్డు స్వైపింగ్ పాల్పడుతూ కోట్ల రూపాయల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియన్‌తో పాటు కోల్‌కతాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. సైజీరియా కేంద్రంగా సాగుతున్న మోసం గురించి గచ్చిబౌలి కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. చింతల్‌లో నివాసముండే పంతం వెంకట కృష్ణకు ఏలీం కెమికల్స్, సాలోమ్ కెమికల్ ఇండ్రస్టీస్ ఉన్నాయి. గత నెల 15 శనివారం సాయంత్ర 8గంటలకు వెంకట కృష్ణకు సంబంధించిన ఫోన్ నెట్‌వర్కు నిలిచిపోయింది. కొంత సమయం తరువాత సంబంధిత కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే నెట్‌వర్కుకు ఎలాంటి సమస్య లేదని ఫీర్యాదు తీసుకుంటున్నామని ఆదివారం తమ కార్యలయానికి సెలవని సోమవారం సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. సోమవారం ఉదయం 10గంటలలోపు ఏలీమ్ సంస్థ ఖాతా నుంచి రూ.4లక్షలు, సాలోమ్ కెమికల్స్ సంస్థ ఖాతా నుంచి రూ.5లక్షలు నెట్ బ్యాంకిగ్ ద్వారా బదిలీ అయినట్లు ఎస్‌ఎంఎస్ వచ్చింది. బ్యాంక్ అధికారులను సంప్రదించగా కోల్‌కత్తలోని ఖాతాలకు బదిలీ అయినట్లు చెప్పారు. లావాదేవిలు నిలిపి వేసి సైబర్ క్రైం పోలీసులకు ఫీర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసుల బృందం కోల్‌కత్తకు వెళ్లి సంతోష్ బెనర్జీ(52), అంకన్ సాహ(31), రజీత్ కుండు(35), చందన్ వర్మ(42), సంజిబ్ దాస్(38)తో పాటు నైజీరియాకు చెందిన ఓడాఫీ హెన్రీని అదుపులోకి తీసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడైన ఎబిగో ఇనోసెంట్(పరారీలో ఉన్నాడు) నైజీరియా నుంచి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇనోసెంట్.. ఫిషింగ్ మెయిల్స్ ద్వారా నెట్ బ్యాంక్ చేసే కంపెనీల సమాచారం సేకరించి వారి వివరాలను కోల్‌కత్తలో ఉన్న సంతోష్ బెనర్జీకి పంపిస్తాడు. ఖాతాదారుడి ఫోన్ నెంబర్‌తో పాటు పూర్తి వివరాలను సంతోష్‌కు తెలియ చేస్తాడు. ఖాతాదారుడు నివాసముండే ప్రాంతానికి అంకన్ సాహ, రజిత్ కుండు, చందన్ వర్మ చేరుకుని ఇనోసెంట్‌కు సమాచారం ఇస్తారు. ఇనోసెంట్ తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో శనివారం సాయంత్రం ఖాతాదారుడి ఫోన్ పని చేయకుండా చేస్తాడు. సోమవారం ఖాతాదారుని పేరుతో సిమ్ కార్డు తీసుకుని వెంటనే సిమ్ వెనుక ఉన్న 20 నెంబర్లను నైజీరియాలో ఉన్న ఇనోసెంట్‌కు తెలియచేస్తారు. సీమ్ యాక్టివేట్ కాగానే నెట్ బ్యాంకింగ్‌లో ఉన్న ఇనోసెంట్ సిమ్ కార్డు వాడుతున్న వారి నుంచి ఓటీపీ తీసుకుని డబ్బును నిముషాల వ్యవధిలో తమ ఖాతాలలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. వచ్చిన డబ్బును పరిమితి వరకు డ్రా చేసుకుని మిగిలిన డబ్బులను బంగారం కోనుగోలు చేస్తారని సీపీ వివరించారు. సంతోష్ బెనర్జీ నకిలీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరవడంతో పాటు నకిలీ పత్రాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడని తెలిపారు. చందన్ వర్మ, రజిత్ కుండు, సంజిబ్ దాస్ నకిలీ సిమ్‌లు తీసుకుంటారని చెప్పారు. దేశంలోని 13 కంపెనీలకు చెందిన కోటి రూపాయల వరకు కాజేసినట్లు విచారణలో తెలిందని, కోర్టు అనుమతి తీసుకుని మారో మారు నిందితులను విచారించనున్నట్లు సీపీ వివరించారు. ప్రధాన నిందితుడు ఎబిగో ఇనోసెంట్ పరారీలో ఉన్నాడని ఫిషింగ్ మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాని చెప్పారు. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నిందితులు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కంపెనీల యజమానుల ఖాతాలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారని, దేశంలోనే మొదటిసారి నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ వివరించారు. శనివారం ఫోన్ నెట్‌వర్కు పని చేయకపోతే ఆలోచించాలని చెప్పారు. వినియోగదారుడికి తెలియకుండా సిమ్ ఇచ్చిన నెట్‌వర్కు సంస్థపై, సిబ్బందిపై కేసు నమోదు చేస్తామని సీసీప చెప్పారు. త్వరలో నెట్‌వర్కు ప్రొవైడర్లు, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 17 సెల్‌ఫోన్లు, లాప్‌ట్యాప్, మూడు హార్డ్‌డిస్క్‌లు, నైజీరియన్ పాస్‌పోర్టుతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైం సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు విజయ్ వర్దన్, సిద్దేశ్వర్, సిబ్బందిని సీపీ అభినందించారు. క్రైం డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.