క్రైమ్/లీగల్

ఆయేషా కేసులో కొనసాగిన సీబీఐ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 19: బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఓసారి విజయవాడ కోర్టులో తుది తీర్పు వెలువడటం, దోషిగా నిర్ధారించిన పిడతల సత్యంబాబును జైలుశిక్ష పడిన ఎనిమిదేళ్ళ తర్వాత హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడం, అదేవిధంగా మరోవైపు కింది కోర్టులో కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసం కావడం వంటి పరిణామాల నేపధ్యంలో మొదటి నుంచి సీబీఐ విచారణ ప్రారంభించింది. దీనిలో భాగంగా సత్యంబాబుతోపాటు, ఆది నుంచీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్‌లను సీబీఐ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈక్రమంలో రెండోరోజు శనివారం విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఇబ్రహీంపట్నంలో ఘటన చోటు చేసుకున్న దుర్గా హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. అయితే సిబిఐ బృందం రాకను తెలుసుకుని పెద్ద ఎత్తున స్ధానికులు, మీడియా ప్రతినిధులు రావడంతో విచారణ ఇబ్బందిగా భావించిన సిబిఐ అధికారులు కొద్ది సేపట్లోనే అక్కడి నుంచి వెనుదిరిగారు. శనివారం రాత్రి లేదా ఆదివారం తెల్లవారుజామున తిరిగి హాస్టల్ వద్దకు చేరుకుని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడికి చెందిన చింతా పవన్‌ను అనే వ్యక్తిని కూడా ఈ కేసుకు సంబంధించి విచారించారు. పవన్ స్నేహితుడైన అబ్బూరి గణేష్ తదితరులతో కలిసి తరచూ హాస్టల్ సమీపంలోని కిళ్ళీ షాపు వద్దకు వచ్చే సమయంలోనే కోనేరు సతీష్ వీరికి పరిచయమైనట్లు అప్పట్లో పోలీసు వర్గాల కథనం. ఆయేషామీరా తల్లిదండ్రుల వైపు నుంచి కూడా వీరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో హాస్టల్‌లో పని చేసిన సిబ్బందితోపాటు ఆయేషామీరా తల్లిదండ్రులను కూడా అధికారులు విచారించనున్నారు. ఈక్రమంలోనే ఈ కేసులో తొలుత నుంచీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న వారినందరినీ విచారించిన మీదట నివేదిక సిద్ధం చేసి దాని ప్రకారం చట్టపరమైన చర్యలకు సిబిఐ అధికారులు ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.