క్రైమ్/లీగల్

ఎన్‌ఐఏపై హౌస్‌మోషన్ పిటిషన్ తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 19:ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యయత్నం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తును వ్యతిరేకిస్తూ దాఖలైన హౌస్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత నుంచీ కూడా ఎన్‌ఐఏ ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బాధ్యతల నుంచి ఎన్‌ఐఏను తప్పించాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శనివారం విచారణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ హౌస్‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఇప్పటికిప్పుడు విచారించాల్సినంత అత్యవసర పరిస్ధితి లేదంటూ తిరస్కరించింది. సాధారణ విచారణలో భాగంగా ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరుగనుంది.
వైసీపీ నేతల విచారణ
ఇదిలావుండగా కోడికత్తి దాడి కేసులో పది మంది వైసీపీ నేతలను ఎన్‌ఐఏ అధికారుల బృందం ప్రశ్నించింది. విశాఖలోని వైసీపీ నేత మళ్ళ విజయప్రసాద్ ఇంట్లో నేతలను విచారించినట్లు తెలుస్తోంది. జగన్‌పై దాడి సమయంలో విమానాశ్రయంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మొత్తం పది మంది నాయకులను విచారించి వారి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం.