క్రైమ్/లీగల్

సంపులో పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, జనవరి 20: ఈత కోసం వెళ్లి సంపులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బూర్గుల గ్రామానికి చెందిన తండ్రి రంగయ్య, తల్లి సత్యమ్మల కుమారుడు పవన్‌కుమార్(17)తో పాటు మరో ఇద్దరు యువకులు గ్రామంలో ఈత కోసం సంపు వద్దకు వెళ్లారు. పవన్‌కుమార్‌కు ఈత రాకపోవడంతో సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ సంఘటనపై షాద్‌నగర్ పోలీసులు విచారణ కొనసాగ్తిన్నారు.
రోడ్డు పక్కన నిలిపిన లారీలో మంటలు
మేడ్చల్, జనవరి 20: మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద చెత్త కుప్పల పక్కన నిలిపిన లారీకి మంటలంటుకున్నాయి. ఎస్‌ఐ గజేందర్ కథనం ప్రకారం... చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారి పక్కన ఆదివారం ఉదయం లారీ పార్కు చేసి ఉండగా పక్కనే ఉన్న చెత్త కుప్పలో కొంత మంది చలిమంటలు వేసుకుని వెళ్లిపోయారు. చలి మంటలు మెల్లగా పక్కన ఉన్న లారీ వరకు వ్యాపించి లారీ టైర్లకు తగలడంతో ఒక్కసారి మంటలు చేలరేగి మిగతా ఎనిమిది టైర్లకు అంటుకున్నాయి. మంటల్లో లారీ దగ్ధం అవడాన్ని చూసి స్థానికులు విస్తుపోయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అంతలోనే అగ్నిమాపక వాహనం వచ్చి లారీ పూర్తిగా దగ్ధం కాకుండా నిలువరించింది. అప్పటికే నష్టం జరిగిపోయింది. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ గజేందర్ తెలిపారు.