క్రైమ్/లీగల్

మందుబాబులకు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో పట్టుబడుతున్నారు. నగర ట్రాఫిక్ జాయింట్ సిపి అందించిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి15 వరకు చేపట్టిన డ్రైవ్‌లో 6,781 మందిపై చార్చిషీట్లు దాఖలు చేయగా, వారిలో 1103 మందికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కాగా 46 మందికి శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయగా, 429 మందికి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ న్యాయస్ధానం ఆదేశించింది. ట్రాఫిక్ పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో డ్రైవర్ నాలుగు సార్లు మద్యం సేవించి ఆటో నడుపుతూ పట్టుబట్టాడు. అతనికి న్యాయస్ధానం నెల రోజులు జైలు శిక్ష విధించింది. ఇవి కాకుండా ఇంకా డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడపడం, మితిమీరిన వేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మైనర్లు వాహనం నడిపడం వంటి కేసుల్లో 170 మందికి ఆయా కేసుల తీవ్రతను బట్టి జైలు శిక్షలు పడ్డాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.