క్రైమ్/లీగల్

భార్యను కడతేర్చిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 22: అగ్ని సాక్షిగా జీవితాంతం తోడు ఉంటానని తాళికట్టిన భర్త క్షణికావేశంలో కాలయముడైన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని కలెక్టరేట్‌కు సమీపంలో కణపాకలోని అగురు వీధిలో నివసిస్తున్న శీల మారమ్మను (55) భర్త సన్యాసిరావు సోమవారం ఉదయం సుమారు 9.40 గంటల సమయంలో హతమార్చడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. చుట్టు పక్కన అందరు ఉంటుండగానే భర్త కత్తితో భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఏకధాటిగా మూడు కత్తిపోట్లు పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత కొంత కాలం నుంచి భార్య, భర్తలిద్దరు కుమారుని ఇంట నివసిస్తున్నారు. తరచు భార్య, భర్తలు ఘర్షణలు పడుతుండేవారని తెలిపారు. ఈ రోజు ఉదయం కూడా ఘర్షణ పడినపుడు కత్తితో చంపేస్తానని భర్త సన్యాసిరావు భార్యను బెదిరించగా కొడుకు, కోడలు అతన్ని అడ్డుకున్నారని, ఆ తరువాత కొద్ది సేపటికే మళ్లీ భర్త కత్తితీసి భార్య మారమ్మను హతమార్చాడని తెలిపారు. దీంతో బంధువులు నిందితున్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. డిఎస్పీ సూర్యశ్రావణ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టంనకు తరలించారు. వన్‌టౌన్ ఎస్‌ఐ ఆర్పీఆర్ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.