క్రైమ్/లీగల్

48 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, జనవరి 21: రామచంద్రపురం పట్టణ సరిహద్దులో వాహనాలను తనిఖీ చేస్తుండగా స్థానిక బైపాస్ రోడ్డు జంక్షన్లో పోలీసులకు గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. రామచంద్రపురం బైపాస్ రోడ్డులో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పెద్దిరెడ్డి శివగణేష్ నేతృత్వంలో సిబ్బంది సోమవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు ఆటోలో వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో చీరల మూటలలో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే ఆర్డీవో ఎన్ రాజశేఖర్‌కు సమాచారం అందించగా ఆయన ఆదేశాల మేరకు తహసీల్దారు పైడి చిన్నారావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె మహాలక్ష్మీనాయుడు, వీఆర్వో పెంకె సత్యనారాయణ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రూ.లక్షా 92 వేల విలువైన 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ ఎస్ లక్ష్మి తెలిపారు. పట్టుబడిన వారిలో రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు, చెన్నయికి చెందిన ఒకరు, రంగంపేటకు చెందిన ఒకరు ఉన్నట్టు ఎస్‌ఐ వివరించారు. మండపేట వైపు నుండి కాకినాడ వైపునకు ఆటోలో చీరల మూటల్లో వీరు గంజాయిని తరలిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి నిందితులు నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ లక్ష్మి తెలిపారు.