క్రైమ్/లీగల్

స్కూళ్లలో టీచర్లేరీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి చివరిలోగా టీచర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. టీచర్ల నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, గతంలో టీచర్ల ఖాళీలలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అమలుజరగడం లేదని దాఖలైన ఎస్‌ఎల్‌పీలను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలో టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రక్రియ పూర్తయినా నియామక పత్రాలు జారీ చేయడం లేదని పిటీషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. నియామకాలకు సంబంధించి హైకోర్టులో కొన్ని పిటీషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ కౌన్సిల్ వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ వివరణ ఇస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం, ఎంపిక పరీక్ష నిర్వహించడం, కీ సైతం విడుదల చేశామని త్వరలోనే తుది ఎంపిక జరిపి జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కేసును తదుపరి విచారణకు పిటీషన్‌ను మార్చి మొదటివారానికి వాయిదా వేసింది. ఇంతకాలం గడిచినా టీచర్ల నియామకాలు పూర్తికాకపోవడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.