క్రైమ్/లీగల్

ఎన్‌ఐఏ దర్యాప్తుపై స్టే ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణపై స్టే ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు దర్యాప్తును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రావడంతో ప్రభుత్వం తరుఫు వాదనలను హైకోర్టు ఆలకించింది. జగన్ తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న మీదట హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే సమయంలో ఎన్‌ఐఏ విచారణ నిలుపుదల చేయాలన్న దానిపై ఈ నెల 30వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తుకు సంబంధించి రికార్డులను కోర్టు ముందు పెట్టాలని ఎన్‌ఐఏను ఆదేశించింది. ఇదిలావుండగా ఈ కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం కాబట్టి సుప్రీం కోర్టులో మాత్రమే విచారించాలని జగన్ తరుఫు న్యాయవాదులు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.