క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 16: రోడ్డు ప్రమాదంలో ఇద్ద రు వ్యక్తులు మృతి చెందిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పటాన్‌చెరు, అమీన్‌పూర్‌కు చెందిన ఊటికూరి మహే శ్ (28) ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఇస్నాపూర్‌కు చెందిన చెడుదూటి సాయితేజ (21) ఎలక్ట్రీషియన్. ఇద్దరు కలిసి టీఎస్ 15 ఈఎస్ 3767 నంబరు గల రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనంపై స్వగ్రామం నుండి తూప్రాన్‌కు వెళ్తున్నారు. మధ్యలో గండిమైసమ్మలోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాల కమాన్ ఎదురుగా వెనుకనుండి గుర్తుతెలియని వాహనం అతివేగంగా దూసుకువచ్చి మహేశ్ వాహనాన్ని ఢీకొట్టింది. సాయితేజ అక్కడికక్కడే మృతిచెందగా మహేశ్‌ను మల్లారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.