క్రైమ్/లీగల్

కారు బోల్తా :ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 21: అదుపుతప్పి కారు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం పరిగి మండలం రుక్కుంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ అతని భార్య కష్ణవేణి(28) హైదరాబాద్‌కు చెందిన బంధువులతో కలిసి అనంతగిరి వెళ్ళేందుకు వికారాబాద్‌కు బయలుదేరారు. రుక్కుంపల్లి నుండి వికారాబాద్ మార్గంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో కృష్ణవేణి మృతి చెందింది. కారులో ఉన్న రమేష్, నర్సింలుకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. గాయపడిన ముగ్గురు మహావీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.