క్రైమ్/లీగల్

ఆయేషామీరా హత్య కేసులో వివరాలు తెలిస్తే చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 21: గతంలో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి వివరాలు తెలిస్తే చెప్పాలని ప్రజలను కోరుతూ సీబీఐ బహిరంగ ప్రకటన చేసింది. కేసుకు సంబంధించి ఎవరైనా తమకు తెలిసిన సమాచారం, వివరాలు తెలియచేసేందుకు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌తోపాటు టోల్‌ఫ్రీ నెంబర్ విడుదల చేసింది. సమాచారం తెలియచేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ డీఐజీ తెలియచేశారు. విచారణలో భాగంగా కేసుకు సంబంధించి సమాచారం, వివరాలు తెలియచేయాలంటూ టోల్ ఫ్రీ : 93465 90818 నెంబర్‌తోపాటు ‘సిబిఐవిజయవాడఅట్‌దిరేట్‌ఆఫ్‌సిబిఐ.జిఓవి.ఇన్’ ఇ మెయిల్ అడ్రస్‌ను కూడా విడుదల చేశారు.