క్రైమ్/లీగల్

విజయవాడలో గాజుపెట్టె కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 21: నగరంలో ఓ గాజుపెట్టె కలకలం రేపింది. టాస్క్ఫోర్స్ పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద ఈ పెట్టె బయటపడింది. పెట్టె ఉన్న తీరును బట్టి తొలుత ఊహాగానాలు ఊపందుకున్నాయి. రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో బాక్సును కృష్ణానదీ తీరానికి తీసుకెళ్లి కొన్ని గంటలపాటు కసరత్తు చేసిన మీదట ఎట్టకేలకు తెరిచారు. బాక్సు తెరిచేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు. కట్టుదిట్ట భద్రత నడుమ నదీ తీర ప్రాంతంలో పెట్టెను తెరిచిన పోలీసులు పేలుడు పదార్థాలు లేవని గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ పెట్టెలో రెండు బ్యాటరీలు, రాగి బిందె, అయస్కాంతం, రాగి తీగలు ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. టాస్క్ఫోర్స్, కృష్ణలంక పోలీసులతోపాటు ప్రత్యేక నిపుణుల బృందం మధ్యాహ్నం నుంచి శ్రమించిన మీదట చివరికి పెట్టె నుంచి బయటపడిన సామాగ్రిని బట్టి రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన వాటిగా భావిస్తున్నారు. మొత్తం మీద సోమవారం మధ్యాహ్నాం నుంచి రాత్రి వరకూ ఈ అనుమానాస్పద పెట్టెపై నగర పోలీసు యంత్రాంగం పెద్ద కుస్తీనే చేసింది. అంతకు ముందు టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్‌కుమార్, సిఐ రాయి సురేష్‌రెడ్డి బృందం కొందరు వ్యక్తులను నగరంలో అదుపులోకి తీసుకోగా, వారి వద్ద ఈ పెట్టె దొరకటంతో స్వాధీనం చేసుకున్నారు. బాక్సుపై పుర్రె బొమ్మ ఉండటంతో పేలుడు సామాగ్రిగా భావించి అప్రమత్తమై కృష్ణానదీ తీరానికి తీసుకెళ్లి తెరిచి చూశారు. అందులో ఉన్న సామాగ్రితో అవాక్కయ్యారు. అయితే చిత్తూరు, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 20మంది వ్యక్తులు కలిసి రైస్‌పుల్లింగ్ పేరుతో మోసానికి పాల్పడి కోట్లు దండుకోవాలని ఈ బాక్సును గాజు అద్దాలతో తయారు చేసి దానికి శక్తి ఉన్నట్లుగా చూపించేందుకు అయస్కాంతాలు, కాపర్ వైర్లు, రాగి బిందె తదితర సామాగ్రి ఉంచి సీల్ చేశారు. రైస్‌పుల్లింగ్‌ను విశ్వసించే వ్యక్తి కోసం చేస్తున్న అనే్వషణలో పోలీసులకు దొరికిపోయారు. కారుతో సహా 30వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని సుమారు 20మంది నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.