క్రైమ్/లీగల్

కేంద్రానికి మద్రాసు హైకోర్టు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 21: రాజ్యాంగాన్ని సవరించి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. జనరల్ కేటగిరీ కింద ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగానికి విరుద్ధమని డీఎంకే మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. అనంతరం ఫిబ్రవరి 18లోగా వివరణ ఇవ్వాలని కేంద్రానికి జస్టిస్ ఎస్.మణికుమార్, సుబ్రహ్మణ్యం ప్రసాద్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ నోటీసులు జారీచేసింది. డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ కేవలం రాజకీయ లబ్ధితోకూడిన లిటిగేషన్ అని వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) జి. రాజగోపాలన్ వాదనలతో బెంచ్ ఏకీభవించలేదు. రిజర్వేషన్లు కేవలం సమాజంలో అడ్డడుగు వర్గాల కోసమేనని డీఎంకె తరఫున ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్. భారతి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పది శాతం రిజర్వేషన్లు వద్దనడం కేవలం డీఎంకే వ్యక్తిగత అజెండా అని కేంద్రం తరఫున ఏఎస్‌జీ వాదించారు. చట్టాన్ని రూపొందించిన పార్లమెంటు, దాన్ని అమలుపరిచే రాజ్యాంగ వ్యవస్థ మధ్య ఈ పిటిషన్ స్పర్థలు కల్పిస్తోందని రాజగోపాలన్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అన్నవి కేవలం ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాలకు మాత్రమే వర్తిస్తాయని, దీనిలో వ్యక్తిగత ప్రయోజనాలకు తావే లేదని పిటిషన్ తరఫున పి. విల్సన్ తన వాదనలు వినిపించారు. బీసీ కోటాలో మాత్రమే క్రీమీలేయర్ కింద ఆర్థిక పరిస్థితిని ప్రామాణికంగా తీసుకున్నారని వివరించారు. తమిళనాడులో ఇప్పటికే 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరో పది శాతం కలిపితో అది 79 శాతానికి చేరుతుంది. అందుకే కేంద్రం తాజాగా రూపొందించిన చట్టాన్ని అమల్లోకి రాకుండా మధ్యంతర ఆదేశాలు జారీచేయాలని పిటిషనర్ వాదించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లను గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చాయి.