క్రైమ్/లీగల్

యువకునిపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 22: కోళ్లను దొంగలించాడన్న అనుమానంతో యువకున్ని కాళ్లూ చేతులు కట్టి వేసి విచక్షణారహితంగా చితక బాదిన సంఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు చిత్తూరు టూ టౌన్ సీఐ వెంకటకుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెనుమూరు మండలం ఓబయ్య గారిపల్లికి చెందిన వేణుగోపాల్ చిత్తూరు నగరంలోని చికెన్ సెంటర్‌కు కోళ్లను సరఫరా చేసే వాహనానికి డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో ఈనెల 13వ తేదీన చిత్తూరు నగరానికి చెందిన చికెన్ సెంటర్ యజమాని చిట్టినాయుడు తన కోళ్లను వేణుగోపాల్ దొంగలించాడన్న నెపంతో వేణుగోపాల్‌ను గదిలో నిర్బంధించి, కాళ్లు చేతులు కట్టి వేసి తన అనుచరులతో కలిసి కర్రతో విచక్షణారహితంగా చితకబాదారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి ఎక్కడైనా ఈ విషయాలను చెపితే నీకుటుంబ సభ్యులను హతమార్చుతామని బెదిరించారు. ఈ నేపథ్యంలో వేణుగోపాల్‌ను కొడుతున్న సెల్‌ఫోన్ దృశ్యాలు ఇటీవల సోషియల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టామన్నారు. ఈకేసులో ప్రధాన నిందితుడైన చిట్టినాయుడుతో పాటు అతని అనుచరలులైన షరీష్, మస్తాన్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి భరద్వాజ్ నిందితులకు వచ్చేనెల 5వ తేదీ వరకు రిమాండ్ విధించారని, వీరిని రిమాండ్ నిమిత్తం చిత్తూరు సబ్ జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.